న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పెహల్గామ్లో(Pahalgam Terror Attack) ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు బైసరాన్ లోయలో ఈ అటాక్ జరిగింది. విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పెహల్గామ్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే బైసరాన్ ఓ సుందర ప్రదేశం. అక్కడికి ప్రతి రోజు వందల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. అయితే ఆ పర్యాటకులనే ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనాల ప్రకారం.. కేవలం హిందువులనే ఆ ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
BREAKING: Shocking video shows Islamist terrorists opening fire during today’s massacre in Kashmir. At least 27 Hindu tourists were killed.
Pakistani gunmen reportedly checked IDs—or forced men to undress—to confirm they were Hindu before executing them.pic.twitter.com/3HZCIBCpIa
— Eyal Yakoby (@EYakoby) April 22, 2025
బైసరన్‌లో ఉన్న గ్రీనర్ నుంచి ఆయుధాలతో చొరబడిన ఉగ్రవాదులు.. ఎంపిక చేసి మరీ ఊచకోతకు పాల్పడినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు అనుబంధంగా ఉన్న ద రెసిస్టాన్స్ ఫ్రంట్ సంస్థ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ఈ సంస్థే కారణం. అయితే మంగళవారం దాడి సమయంలో.. ఉగ్రవాదులు కేవలం హిందూ పర్యాటకులనే అటాక్ చేశారు. టూరిస్టుల ఐడీలను చెక్ చేసి మరీ కాల్చి చంపారు. పురుషుల దుస్తులు విప్పించినట్లు కొందరు సాక్ష్యులు చెబుతున్నారు. హిందువులా కాదా అన్న నిర్ధారణకు వచ్చేందుకు అలా చేశారని అంచనా వేస్తున్నారు.
Shocking Video from Kashmir
नाम पूछा
हिंदू निकला तो गोली मार दी
— The Jaipur Dialogues (@JaipurDialogues) April 22, 2025
ఫైరింగ్‌కు చెందిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఫుడ్ స్టాళ్ల వద్ద ఉన్న టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. క్షణాల్లో పచ్చిక బయళ్లు అన్నీ రక్తపు టేరులయ్యాయి. కాల్పుల తర్వాత బైసరన్ ప్రాంతంలో పలు చోట్ల మృతదేహాలు పడి ఉన్నట్లు స్థానిక టూరిజం పరిశ్రమ వ్యక్తి ఒకరు తెలిపారు. ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాల్పుల మోతతో టూరిస్టులు పరుగులు పెట్టారు. కానీ అక్కడ విశాలమైన ఖాళీ ప్రదేశం ఉండడంతో.. జనం దాక్కోవడానికి వీలుకాలేదు. ఓపెన్ స్పేస్ వల్ల పరుగు తీసినా ఫలితం లేకుండా పోయిందని ఓ మహిళా టూరిస్టు తెలిపారు. ఫైరింగ్ చేయడానికి ముందు ఉగ్రవాదులు పేర్లు తెలుసుకున్నారని ఆ మహిళ చెప్పింది. ఓ వ్యక్తి వచ్చి భర్తను కాల్చి చంపాడని ఓ మహిళ వెల్లడించింది.
Traumatic experience of those tourists who saw Pahalgam terror attack in front of their eyes in Kashmir and managed to escape. Indian Army comes to the rescue. Heart goes out to all the victim families in India. We stand in solidarity with each one of you. pic.twitter.com/d8WeM0vuvM
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 22, 2025