Pahalgam | జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్ (Pahalgam)లో నరమేధానికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఫొటోను భద్రతా సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో ముగ్గురి పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. ఆసిఫ్ ఫౌజీ పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్‌గా దర్యాప్తు సంస్థ గుర్తించింది.
ఈ నలుగురు పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తు సంస్థలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ నలుగురిలో ఇద్దరు విదేశీలుగా భావిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఉండటంతో.. ఈ దాడి వెనుక పాక్ కుట్ర ఉన్నట్లు బట్టబయలైంది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఎన్ఐఏ బృందం ముష్కరులు వాడిన భాష, ఇతర వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించారు. టెర్రరిస్టులు దాడి సమయంలో పష్తూన్ భాషలో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ నలుగురు ముష్కరులు మరో ముగ్గురు స్థానికులు సహకరించినట్లు తేలింది.
Also Read..
Terrorists | పెహల్గామ్ ఉగ్ర దాడి.. ముష్కరుల ఊహా చిత్రాలను రిలీజ్ చేసిన ఏజెన్సీలు