PM Modi | ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) త్వరలో భారత పర్యటనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి నెతన్యాహు ఈనెలలోనే ఇండియాని విజిట్ చేయాల్సి ఉంది. చివరి నిమిషంలో ఆయన పర్యటన వాయిదా పడింది. అయితే, తాజాగా ప్రధాని మోదీ (PM Modi)తో ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్లో సంభాషించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. అదే సమయంలో త్వరలో కలిసేందుకు ఇద్దరూ అంగీకారం తెలిపినట్లు ఇజ్రాయెల్ పీఎంవో సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంభాషణ జరిగినట్లు తెలిపింది. ఇద్దరు నేతలు త్వరలో కలవడానికి అంగీకరించినట్లు వెల్లడించింది. ఇందుకోసం తేదీని ఖరారు చేసేందుకు ఇజ్రాయెల్ అధికారులు భారత అధికారులతో ప్రస్తుతం సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొంది.
Also Read..
India In UN | అఫ్ఘాన్‌పై పాక్ దాడులు యుద్ధ చర్యలే : భారత్
Maria Corina Machado | అజ్ఞాతం వీడి.. నార్వేలో ప్రత్యక్షమైన నోబెల్ శాంతి గ్రహీత మచాడో.. VIDEO