Maria Corina Machado | ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) గ్రహీత, వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినీ మచాడో (Maria Corina Machado) అజ్ఞాతం వీడారు. దాదాపు ఏడాది పాటూ అజ్ఞాతంలో ఉన్న ఆమె తాజాగా నార్వేలో ప్రత్యక్షమయ్యారు. నార్వేలోని ఓ హోటల్ వద్ద బహిరంగంగా కనిపించారు. ఈ మేరకు తన మద్దతుదారులకు అభివాదం చేశారు.
¡Oslo, aquí estoy! pic.twitter.com/tsixUerj0q
— María Corina Machado (@MariaCorinaYA) December 11, 2025
కాగా, ఈ ఏడాది నోబెల్ బహుమతి మచాడోను వరించిన విషయం తెలిసిందే. నిన్న నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మచాడో హాజరుకాలేదు. దీంతో ఆమె కుమార్తె నోబెల్ బహుమతిని స్వీకరించారు. ఇక ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటల్లోనే మచాడో అజ్ఞాతం వీడి పబ్లిక్‌లోకి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
¡Qué alegría ver a María Corina Machado ya en Oslo! Su llegada trae un mensaje de esperanza y demuestra que ningún régimen puede apagar para siempre la voluntad de un pueblo que busca libertad. Que su valentía inspire a toda nuestra región.#PremioNobelDeLaPaz #VenezuelaLibre pic.twitter.com/XBqmAJ1qKX
— Keiko Fujimori (@KeikoFujimori) December 11, 2025
వెనెజువెలాలో మదురో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అనేక ఏళ్లుగా సాగుతున్న ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి మచాడో సారథ్యం వహిస్తున్నారు. ఆమె బెదిరింపులను ఎదుర్కోవడమే కాక అరెస్టు కూడా అయ్యారు. ప్రయాణ నిషేధాలను, రాజకీయ వేధింపులను ఎన్నో ఎదుర్కొన్నారు. ఇన్ని కష్టాలను తట్టుకుని కూడా ఆమె వెనెజువెలాలోనే ఉండి ఉక్కు మహిళగా గుర్తింపు పొందారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా నిషేధం విధించారు. తమదే నిజమైన విజయమని ప్రతిపక్షం ప్రకటించుకున్నప్పటికీ మదురో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మచాడో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైన మచాడో 2013లో సహవ్యవస్థాపకురాలిగా వెంటే వెనెజువెలా పేరిట ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దాని జాతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
El abrazo que necesita toda Venezuela.
Gracias!! pic.twitter.com/ozQgFQzGjq— María Corina Machado (@MariaCorinaYA) December 11, 2025
Also Read..
Maria Corina Machado | నోబెల్ బహుమతి అందుకున్న మచాడో కుమార్తె
Maria Machado | ‘నోబెల్ పీస్ ప్రైజ్’ అందుకునేందుకు రాని మరియా మచాడో.. ఎందుకంటే..!
Maria Corina Machado | నేడే నోబెల్ పురస్కార ప్రదానోత్సవం.. మచాడో హాజరవుతారా..?