Maria Corina Machado | ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం నార్వే రాజధాని ఓస్లో (Oslo)లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నోబెల్ బహుమతి గ్రహీత, వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో (Maria Corina Machado) హాజరు కాలేదు. దీంతో ఈ బహుమతిని మచాడో కుమార్తె అనా కొరీనా సోసా (Ana Corina Sosa) స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మచాడో ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. ఇక ఈ సభకు నేరుగా హాజరుకాలేకపోయిన మచాడో.. వీడియో ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. ‘ఈ బహుమతి వెనుజువెలా ప్రజలకు అంకితం’ అని భావోద్వేగంతో ప్రసంగించారు.
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ఈ ఏడాదికిగానూ వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో (Maria Corina Machado) ను వరించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం నార్వేలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం కోసం నార్వే చేరుకున్న మచాడో.. ఓస్లాకు మాత్రం రాలేకపోయారు. అందుకుగల కారణాలు వెల్లడికాలేదు. మరోవైపు ఈ ఏడాది జనవరి నుంచి అజ్ఞాతంలో ఉన్న మచాడో.. నోబెల్ బహుమతి స్వీకరించడానికి దేశందాటి బయటకు వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఇప్పటికే వెనెజువెలా అటార్నీ జనరల్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
Watch the very moment Maria Corina Machado’s daughter Ana collected this year’s Nobel Peace Prize medal and diploma on behalf of her mother.
Machado was awarded the 2025 Nobel Peace Prize for her tireless work promoting democratic rights for the people of Venezuela.
Learn… pic.twitter.com/gLORIbv50T
— The Nobel Prize (@NobelPrize) December 10, 2025
Also Read..
Donald Trump | గోల్డ్ కార్డ్ స్కీమ్‌ను ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్..!
Pak | బుద్ధి చూపించిన పాక్ ఎంపీలు.. పార్లమెంట్ సాక్షిగా నవ్వుల పాలు..!
Maria Corina Machado | నేడే నోబెల్ పురస్కార ప్రదానోత్సవం.. మచాడో హాజరవుతారా..?