Modi-Putin | రష్యా-భారత్ (Russia-India Ties) మధ్య స్నేహం మరింత బలపడుతోంది. అదే సమయంలో ట్రంప్ నిర్ణయాలతో అమెరికా-భారత్ మధ్య బంధం దిగజారుతోంది. ఈ పరిణామాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇటీవలే రష్యా అధినేత పుతిన్ (Putin) భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) స్వయంగా పుతిన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. ఆ సమయంలో వీరిద్దరూ తీసుకున్న ఓసెల్ఫీ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ సెల్ఫీ ఫొటో ముఖ్యంగా అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఒక్క చిత్రం అనేక సందేశాలు ఇస్తోందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సిడ్నీ కమ్లాగర్ దువ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారత్‌పై ట్రంప్ ప్రభుత్వ వైఖరిని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి విధానాలు అమెరికా-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక, పరస్పర అవగాహనకు నష్టం చేకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ని దూరం చేసుకుంటే అమెరికాకే నష్టమని వ్యాఖ్యానించారు. ‘వ్యూహాత్మక భాగస్వాములను ప్రత్యర్థులవైపు మళ్లించడం ద్వారా నోబెల్ బహుమతి గెలవలేరు’ అంటూ ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా ట్రంప్ ప్రభుత్వ వైఖరిలో మార్పురావాలని వ్యాఖ్యానించారు.
Also Read..
India In UN | అఫ్ఘాన్‌పై పాక్ దాడులు యుద్ధ చర్యలే : భారత్
Maria Corina Machado | అజ్ఞాతం వీడి.. నార్వేలో ప్రత్యక్షమైన నోబెల్ శాంతి గ్రహీత మచాడో.. VIDEO
Maria Corina Machado | నోబెల్ బహుమతి అందుకున్న మచాడో కుమార్తె