India In UN | అఫ్ఘానిస్థాన్ (Afghanistan)పై పాక్ వైమానిక దాడులను (Pakistani airstrike) భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులను యుద్ధ చర్యలుగా అభివర్ణించింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు, క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసింది. ఇటువంటి దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. ఈ మేరకు తాలిబన్ పాలిత అఫ్ఘానిస్థాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది.
యూఎన్ భద్రతా మండలి సమావేశంలో భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvathaneni Harish) మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలను భారత్ గౌరవిస్తుందని తెలిపారు. అమాయక ప్రజల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. చాలా ఏళ్లుగా బలహీన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న అఫ్ఘాన్ ప్రజల (Afghan civilians)పై దాడులు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న దేశంపై బహిరంగ బెదిరింపులు, యుద్ధ చర్యలు యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. వాణిజ్య, రవాణా మార్గాలను మూసివేయడం ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ టెర్రరిజం అని ధ్వజమెత్తారు. ఈ మేరకు అప్ఘాన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.
Also Read..
Goa Nightclub Fire | గోవా అగ్నిప్రమాదం.. పోలీసుల అదుపులో నైట్‌క్లబ్ యజమానులు
Gujarat | మోదీ ఇలాకాలో మరో ‘నిర్భయ’..! గుజరాత్లో దారుణ ఘటన..!
సంక్షోభం తలెత్తే వరకు ఏం చేస్తున్నారు?