Air India | గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో బిల్డింగ్‌పై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలగించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. ఆ ముగ్గురు అధికారుల్లో ఎయిర్‌లైన్ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నట్లు తెలిసింది.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానం కూలిన అనంతరం 1,000 డిగ్రీల ఉష్ణోగ్రతతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటలో మొత్తం 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇక ఈ ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతదేహాలను అధికారులు గుర్తిస్తున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.
Also Read..
Air India | నేటి నుంచి జులై 15 వరకూ.. అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు నిలిపివేసిన ఎయిర్ ఇండియా
Fake News: ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. ఏడేళ్ల జైలుశిక్ష, 10 లక్షల ఫైన్