F 35B Fighter Jet | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets)లో ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala) లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport) లోనే ఉంది. అత్యంత ఖరీదైనదిగా పేరొందిన ఈ జెట్‌ను గత ఆరు రోజులుగా ఎయిర్‌పోర్ట్‌లో ఆరుబయటే పార్క్ చేసినట్లు సమాచారం. ఈ జెట్‌ను ఇప్పటి వరకూ హ్యాంగర్‌కు తరలించలేదని తెలిసింది.
దీంతో జెట్‌ను తమ హ్యాంగర్‌లో నిలుపుకోవచ్చని బ్రిటన్ నేవీకి ఎయిర్ ఇండియా ప్రతిపాదించగా.. ఆ ఆఫర్‌ను బ్రిటన్ నేవీ అధికారులు తిరస్కరించినట్లు సమాచారం. ఈ ఫైటర్ జెట్ సాంకేతికత గురించి ఆందోళన కారణంగా వారు ఎయిర్ ఇండియా ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా తెలిసింది. తుది తనిఖీల సమయంలో మాత్రం దీన్ని హ్యాంగర్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంటోంది.
బ్రిటన్ దేశానికి చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ ఇటీవల ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత నేవీతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేసింది. బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఆ నౌకలోని యుద్ధ విమానం ఎఫ్-35 ఇంధనం తగ్గడంతో ఆదివారం తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని ముందుగా వార్తలు వినిపించాయి. అయితే, ఇన్ని రోజులు అది ఇక్కడే ఉండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిసింది.
ఆ ఫైటర్ జెట్‌లో సమస్యను సరిచేసిన తర్వాత తిరిగి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పైకి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫైటర్జెట్కు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తున్నది. మన దేశంలో ఓ విదేశీ యుద్ధ విమానం ఐదు రోజులపాటు నిలిచిపోవడం, అందులోనూ ఎఫ్-35 లాంటి 5వ తరం స్టెల్త్జెట్ మోరాయించడం సాధారణ విషయం కాదు. కాగా ఈ విమానం షార్ట్ టేకాఫ్‌తోపాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా దీనిలోనే మరో వేరియంట్ విమానాన్ని ఇరాన్‌పై దాడులకు వాడుతున్నది.
Also Read..
Tamil Nadu Governer | 73 ఏళ్ల వయసులో ఏకబిగిన 51 పుషప్స్.. కుర్రాళ్లకు షాకిచ్చిన గవర్నర్!
Pension | మహిళలకు పెన్షన్ పెంపు.. జూలై నుంచే అమలు
Barak System: డీఆర్డీవో అభివృద్ధి చేసిన బరాక్ మిస్సైల్ సిస్టమ్ వాడుతున్న ఇజ్రాయిల్