Air India | టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా (Air India) సమస్యల వలయంలో చిక్కుకొన్నది. మొన్న జరిగిన విమాన ప్రమాదం ఘటన మరవకముందే ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో సంస్థ ఎయిర్ ఇండియా విమానాల్లో రక్షణ తనిఖీలు చేపడుతోంది. ఈ క్రమంలో నిర్వహణపరమైన (maintenance) ఇబ్బందులతో జాతీయ, అంతర్జాతీయంగా నడిచే పలు విమాన సర్వీసులను సంస్థ రద్దు చేస్తోంది.
వైడ్‌బాడీ విమాన (widebody aircraft) కార్యకలాపాలను జులై మధ్య వరకూ తగ్గించనున్నట్లు ఇటీవలే ఎయిర్‌లైన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 15 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే నేటి నుంచి జులై 15 వరకూ ఉత్తర అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా మార్గాల్లో అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. 16 అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ప్రభావిత మార్గాల్లో గోవా(మోపా)-లండన్(గాత్విక్) AI145/146 విమాన సర్వీసు కూడా ఉంది. ఇది వారానికి మూడుసార్లు నడుస్తుంది.
Also Read..
EOL Vehicles: ఇక ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయరు.. జూలై ఒకటి నుంచి ఢిల్లీలో ఆ రూల్ అమలు
Operation Sindhu | కొనసాగుతున్న ఆపరేషన్ సింధు.. ఢిల్లీ చేరుకున్న 290 మంది విద్యార్థులు