Arvind Kejriwal | ఆగస్టు 15న (August 15) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో తనకు బదులుగా మంత్రి అతిషి పాల్గొంటారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తెలిపారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ (Lt Governor) వీకే సక్సేనాకు సీఎం లేఖ రాశారు. ఆగస్టు 15న తన స్థానంలో అతిషి (Atishi) జాతీయ జెండాను ఎగరవేస్తారని (hoist Tricolour) లేఖలో తెలిపారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా వెల్లడించింది.
ఏటా ఆగస్టు 15 వేడుకల్ని ఢిల్లీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ఛత్రసాల్ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో కేజ్రీ జాతీయ జెండాను ఎగరవేసి.. సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీని ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం సీఎంకు లేదు. తన స్థానంలో అతిషి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటుందని జైలు నుంచి ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ రాసినట్లు ఆప్ వెల్లడించింది.
Also Read..
Prabhas | వయనాడ్ విషాదం.. భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్
Zika virus | పూణెలో జికా వైరస్ కలకలం.. 66 కేసులు నమోదు
Sheikh Hasina | బంగ్లాదేశ్‌లో హింసాకాండ.. హసీనా పార్టీకి చెందిన 29 మంది డెడ్‌బాడీస్ లభ్యం