Sheikh Hasina | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్‌లో విద్యార్థుల మాటున అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి.
ఇక ప్రధాని పదవికి షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేసి దేశం వీడారన్న వార్త తెలియగానే వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. రాజధాని ఢాకాలోని పీఎం అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి.. అక్కడి వస్తువులు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. చేతికందినకాటికి దోచుకెళ్లారు. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వంలోని మంత్రులు, పార్టీ ఎంపీల నివాసాలు, వ్యాపార సంస్థలపై కూడా నిరసన కారులు దాడులు చేశారు.
ఈ దాడుల్లో హసీనా పార్టీకి చెందిన అవామీ లీగ్ (Awami League) నాయకులు, వారి కుటుంబ సభ్యలు మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తాజాగా నివేదించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. 29 మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అందులో కొందరు ఎంపీలు, మాజీ కౌన్సిలర్లు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు తెలిసింది.
Also Read..
Serena Williams: పారిస్ రెస్టారెంట్లో సెరీనా విలియమ్స్‌కు చేదు అనుభవం
Bodhan counceler | లిఫ్ట్ ఇస్తానని బాలికపై కౌన్సిలర్ లైంగికదాడి.. కారులో ఎక్కించుకొని అఘాయిత్యం..!