పారిస్: గ్రాండ్‌స్లామ్ చాంపియన్, టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్(Serena Williams)కు పారిస్ లో చేదు అనుభవం ఎదురైంది. ఫ్యామిలీతో రెస్టారెంట్‌కు వెళ్లగా.. అక్కడ ఆమెకు అనుమతి దక్కలేదు. దీంతో సెరీనా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయాన్ని ఆమె తన ఎక్స్ అకౌంట్లోనూ షేర్ చేసింది. పారిస్‌లోని పెనిన్సులా రూఫ్‌టాప్ రెస్టారెంట్లోకి వెళ్లేందుకు సెరీనా ప్రయత్నించింది. తన ఫ్యామిలీతో కలిసి ఆమె వెళ్లింది. పిల్లలతో వెళ్లిన ఆమెకు అక్కడ టేబుల్స్ దొరకలేదు. దీంతో ఆమెను వెనక్కి పంపించారు.
సెరీనా విలియమ్స్‌ను గుర్తించలేకపోయామని, మరో లేడీతో కలిసి ఆమె రెస్టారెంట్‌కు వచ్చినట్లు పెనిన్సులా రెస్టారెంట్ స్టాఫ్ మెంబర్ మాక్సిమీ మన్నెవే తెలిపారు. ఆమె వచ్చిన సమయంలో రెండు టేబుల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అవి కూడా తమ క్లయింట్స్‌కు రిజర్వ్ అయినట్లు చెప్పారు. స్టాఫ్ గుర్తుపట్టకపోవడం వల్లే .. డౌన్స్టెయిర్స్లో వేచి ఉండాలని ఆమెను కోరినట్లు తెలిపాడు. వ్యక్తిగతమైన అంశం ఇందులో ఏమీ లేదన్నారు.
Yikes @peninsulaparis I’ve been denied access to rooftop to eat in a empty restaurant of nicer places 🫠 but never with my kids. Always a first. 🙄#Olympic2024 pic.twitter.com/lEGJR5WoEn
— Serena Williams (@serenawilliams) August 5, 2024