Prabhas | కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ విలయంలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో విపత్తులో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే సినీ తారలు, పలువురు రాజకీయ నేతలు తమ వంతు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు ప్రభాస్ (Prabhas) భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు అందించనున్నట్లు ఆయన టీమ్ తాజాగా తెలిపింది.
Darling for a reason ❤️🙏
Rebel star #Prabhas announces 2 CR Donation to Help Wayanad Landslide Victims. #WayanadLandslide pic.twitter.com/DnE3QPjrfD
— Suresh PRO (@SureshPRO_) August 7, 2024
కాగా, ఇప్పటికే పలువురు స్టార్స్ విరాళాలు అందించిన విషయం తెలిసిందే. విక్రమ్ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలను అందించారు. అదేవిధంగా మలయాళ నటులు మోహన్‌లాల్ రూ.25 లక్షలు, మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిసి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, రష్మిక ర.10 లక్షలు, స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara), డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) దంపతులు రూ.20 లక్షలను విరాళంగా అందించారు.
Also Read..
Zika virus | పూణెలో జికా వైరస్ కలకలం.. 66 కేసులు నమోదు
Sheikh Hasina | బంగ్లాదేశ్‌లో హింసాకాండ.. హసీనా పార్టీకి చెందిన 29 మంది డెడ్‌బాడీస్ లభ్యం
Manu Bhaker | స్వదేశానికి చేరుకున్న మను బాకర్.. ఢిల్లీలో ఘన స్వాగతం