వాషింగ్టన్ : లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్న విషయం నిర్ధారణ కావటంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) చీఫ్ పదవికి బోర్జ్ బ్రెండే రాజీనామా చేశారు. ఎప్స్టీన్ ఏర్పాటుచేసిన మూడు బిజినెస్ డిన్నర్లలో బ్రెండే పాల్గొన్నట్టు అమెరికా న్యాయశాఖ వెల్లడించిన కొద్ది గంటల్లోనే బ్రెండే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. జెఫ్రీ ఎప్స్టీన్తో ఆయనకు గల సంబంధాలపై డబ్ల్యూఈఎఫ్ కొన్ని వారాల క్రితమే స్వతంత్ర దర్యాప్తు చేపట్టింది. ఎప్స్టీన్తో బ్రెండే సంబంధాలు కలిగి ఉన్నాడని తెలిపే ఈమెయిల్, టెక్ట్స్ సందేశాలు బయటపడ్డాయి.
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు సైతం..‘ఎప్స్టీన్’ మరకలు అంటాయి! ఇద్దరు బికినీ భామల మధ్య సేద తీరుతున్న స్టీఫెన్ హాకింగ్ ఫొటో ఆన్లైన్లో విడుదలైంది. అయితే ఆ ఫొటోలో ఇద్దరు బికినీ గర్ల్స్.. హాకింగ్‌కు కేర్ టేకర్స్‌గా పనిచేస్తున్న వారేనని, ఎప్స్టీన్ లైంగిక నేరాలతో హాకింగ్‌కు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన కుటుంబం తెలిపింది.