హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్‌కు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.53 లక్షల విరాళం ఇచ్చింది. బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్.. గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఈ మేరకు చెక్కును అందించారు.
కాగా, గవర్నర్ సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కెప్టెన్ శ్రీనివాసులుతోపాటు సైనిక్ వెల్ఫేర్ విభాగం, ఎస్బీఐ హైదరాబాద్ సరిల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.