Ahmedabad Plane Crash | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే (Ahmedabad Plane Crash). ఈ ఘటనలో 133 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరింది. మొత్తం 242 మందిలో 169 మంది భారతీయులుగా అధికారులు తెలిపారు. మరో 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా జాతీయుడు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ (medical college hostel) భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 133 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు ప్రమాదంలో హాస్టల్ భవనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అందులోని 20 మంది మెడికోలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Ahmedabad Plane Crash | హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..!
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత