Ahmedabad Plane Crash | గుజరాత్లో విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం మేఘానిలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి (All flight operations suspended). ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఎయిర్పోర్ట్ ప్రతినిధి వెల్లడించారు. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఈ చర్యలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.
గురువారం మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం మేఘానిలో కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై (Residential Area) కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, విమానం కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది.
మోదీ ఆరా..
విమాన ప్రమాదం (Plane Crash)పై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah)తో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కేంద్రమంత్రులను ప్రధాని ఆదేశించారు.
కుప్పకూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Vijay Rupani) ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉన్నది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో .. మాజీ సీఎం రూపానీ .. లండన్ వెళ్తున్నట్లు సమాచారం.
Also Read..
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పైలట్, కో పైలట్ ఎవరంటే..?
Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా.. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశం
Plane Crash | అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం.. ఎగసిపడ్డ మంటలు.. VIDEOS