Plane Crash | గుజరాత్ విమాన ప్రమాదం (Plane Crash)పై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah)తో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కేంద్రమంత్రులను ప్రధాని ఆదేశించారు.
Prime Minister Narendra Modi spoke to the Minister of Civil Aviation, Rammohan Naidu, and took stock of the Air India flight crash incident in Ahmedabad. The Minister informed the Prime Minister that he is rushing to Ahmedabad to oversee rescue and relief operations on the… pic.twitter.com/PiSPkKNs81
— ANI (@ANI) June 12, 2025
గురువారం మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం మేఘానిలో కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై (Residential Area) కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, విమానం కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది.
PM Modi spoke to HM Amit Shah and Civil Aviation Minister Ram Mohan Naidu. He has asked them to go to Ahmedabad and ensure all possible assistance is extended to those affected in the wake of the air mishap: Sources pic.twitter.com/s4fstgDuRh
— ANI (@ANI) June 12, 2025
Also Read..
Air India: విమాన దుర్ఘటనపై సమాచారాన్ని సేకరిస్తున్నాం : ఎయిర్ ఇండియా
Plane Crash | కుప్పకూలిన విమానం.. ఎగసిపడ్డ మంటలు.. VIDEOS
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దిగ్భ్రాంతిని కలిగించింది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు