Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండర్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే పైలట్లు ఇద్దరు ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి మాటలు వినిపించలేదని, నిశ్శబ్ద వాతావరణం ఏర్పడినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు.
ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరింది. ఇక ఈ విమానం పైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయల్దేరింది. విమానానికి ఫస్ట్ ఆఫీసర్‌గా పైలట్ క్లైవ్ కుందర్ ఉన్నారు. సుమిత్ సబర్వాల్‌కు 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. కోపైలట్‌కు 1100 గంటలకు విమానం నడిపిన అనుభవం ఉంది.
విమానం జనావాసాలపై కుప్పకూలడంతో అధిక నష్టం జరిగింది. మంటలు ఎగిసి పడడంతో అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. 90 మంది చొప్పున మూడు బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఈ విమాన ప్రమాదాన్ని ఎయిరిండియా అధికారికంగా ధృవీకరించింది.
#WATCH | Debris at Air India plane crash site in Ahmedabad; Fire Services and other agencies present at the site
Air India B787 Aircraft VT-ANB, while operating flight AI-171 from Ahmedabad to Gatwick, has crashed immediately after takeoff from Ahmedabad. There were 242 people… pic.twitter.com/zn3ZMsJjCi
— ANI (@ANI) June 12, 2025