Ahmedabad Plane Crash | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది (Plane Crash). టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ (medical college hostel) భవనంపై కుప్పకూలింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. హాస్టల్ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది మెడికోలు మరణించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, ఎయిర్పోర్ట్ సమీపంలోని పలు భవనాలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
CISF conducts rescue operations at the AI 171 crash site, Ahmedabad
Photo source: Central Industrial Security Force (CISF) pic.twitter.com/vEhdpx5VgS
— ANI (@ANI) June 12, 2025
కూలిన విమానంలో ఎవరున్నారంటే..?
ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరింది. మొత్తం 242 మందిలో 169 మంది భారతీయులుగా అధికారులు తెలిపారు. మరో 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా జాతీయుడు ఉన్నారు. ఇక ఈ విమానం పైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయల్దేరింది. విమానానికి ఫస్ట్ ఆఫీసర్‌గా పైలట్ క్లైవ్ కుందర్ ఉన్నారు. సుమిత్ సబర్వాల్‌కు 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. కోపైలట్‌కు 1100 గంటలకు విమానం నడిపిన అనుభవం ఉంది.
Also Read..
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
Ahmedabad Plane Crash: 625 అడుగుల ఆల్టిట్యూడ్‌లో.. మేడే కాల్ ఇచ్చిన పైలెట్