Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 1 గంట తర్వాత అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం మేఘానిలో కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే జనావాసాలపై (Residential Area) కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. మొత్తం 242 మందిలో 169 మంది భారతీయులుగా అధికారులు తెలిపారు. మరో 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా జాతీయుడు ఉన్నారు.
Air India flight AI171 crash incident: 1) The flight departed from Ahmedabad for London Gatwick at 1338 hrs, was carrying 242 passengers and crew members on board the Boeing 787-8 aircraft.
2) Of these, 169 are Indian nationals, 53 are British nationals, 1 Canadian national and… pic.twitter.com/Z0z4fB0QnI
— ANI (@ANI) June 12, 2025
పైలట్, కో పైలట్ ఎవరంటే..?
ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరింది. ఇక ఈ విమానం పైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయల్దేరింది. విమానానికి ఫస్ట్ ఆఫీసర్‌గా పైలట్ క్లైవ్ కుందర్ ఉన్నారు. సుమిత్ సబర్వాల్‌కు 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. కోపైలట్‌కు 1100 గంటలకు విమానం నడిపిన అనుభవం ఉంది.
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిన కార్యకలాపాలు
ఈ ఘటనతో అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి (All flight operations suspended). ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఎయిర్పోర్ట్ ప్రతినిధి వెల్లడించారు. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఈ చర్యలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.
మోదీ ఆరా..
విమాన ప్రమాదం (Plane Crash)పై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah)తో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కేంద్రమంత్రులను ప్రధాని ఆదేశించారు.
కుప్పకూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Vijay Rupani) ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉన్నది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో .. మాజీ సీఎం రూపానీ .. లండన్ వెళ్తున్నట్లు సమాచారం.
Also Read..
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
Ahmedabad Plane Crash | డాక్టర్స్ హాస్టల్‌పై కుప్పకూలిన ఎయిరిండియా విమానం : పోలీస్ ఆఫీసర్
Ahmedabad Plane Crash: 625 అడుగుల ఆల్టిట్యూడ్‌లో.. మేడే కాల్ ఇచ్చిన పైలెట్