Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఎయిరిండియా విమానం కుప్పకూలినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. విమానం కుప్పకూలిందన్న విషయం తెలిసిన 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు, ఇతర ఏజెన్సీలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ఘటనాస్థలంలో మంటలను అదుపు చేశామని, 80 శాతం వరకు సహాయక చర్యలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు చెప్పారు. విమానం కూలిన ప్రాంతంలో రెండు భవనాలకు మంటలు అంటుకున్నాయని పోలీసు ఆఫీసర్ తెలిపారు. విమానం కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
#WATCH | Ahmedabad, Gujarat: A senior police officer says, “As per preliminary information, a London-bound Air India flight has crashed at the doctors’ hostel. Within 2-3 minutes, police and other agencies reached the spot. Almost 70-80 % of the area has been cleared. All… pic.twitter.com/ugEQiIIOgB
— ANI (@ANI) June 12, 2025