రఘునాథపాలెం, మార్చి 11: ఖమ్మం భూదాన్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. పేదల ఇళ్లను కూల్చిన భూదాన్ భూముల్లోనే వారికి 75 గజాల చొప్పున స్థలాలు మంజూరు చేసింది.
ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ బందోబస్తు మధ్య పట్టాలు పంపిణీ చేశారు. 750 ఇళ్లను కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 311 మందికి మాత్రమే ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసింది. అర్హులమైనప్పటికీ తమను అనర్హుల జాబితాలో చేర్చారంటూ పట్టాల పంపిణీ సమయంలో పలువురు పేదలు ఆవేదన వ్యక్తం చేశారు.