ఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి 10 వరకూ అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వాల్సిన ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ వాయిదాపడింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఈ టోర్నీని నెల రోజుల పాటు వాయిదావేస్తున్నట్టు ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఏడబ్ల్యూఎఫ్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టోర్నీని మే 12 నుంచి 17 దాకా నిర్వహించనున్నట్టు ఏడబ్ల్యూఎఫ్ వెల్లడిచింది.