అహ్మాదాబాద్ : అహ్మాదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న ఎయిర్ ఇండియా విమానం ఇవాళ మధ్యాహ్నం కూలిన(Ahmedabad Plane Crash) విషయం తెలిసిందే. అయితే ఆ విమాన పైలెట్ .. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే మేడే కాల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఆ పైలెట్ మేడేకాల్ ఇచ్చినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. తక్షణం ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిసినా.. లేక ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చినా.. మేడే కాల్ చేస్తారు. మేడే.. మేడే .. అంటూ పైలెట్లు.. ఏటీసీకి తమకు పొంచి ఉన్న ప్రమాదాన్ని వివరిస్తారు.
We are following reports of a crash of Air India flight #AI171 from Ahmedabad to London. We received the last signal from the aircraft at 08:08:51 UTC, just seconds after take off.
The aircraft involved is a Boeing 787-8 Dreamliner with registration VT-ANB… pic.twitter.com/EmKKISJldF
— Flightradar24 (@flightradar24) June 12, 2025
లండన్‌కు బయలుదేరిన విమానానికి చెందిన ఫ్లయిట్‌రేడార్ డేటా కూడా రిలీజైంది. ఫ్లయిట్ రేడార్24 డేటా ప్రకారం విమానం చివరిసారి 625 అడుగుల ఆల్టిట్యూడ్‌లో డేటాకు చిక్కినట్లు చెబుతున్నారు. ఫ్లయిట్‌రేడార్24 వెబ్సైట్ ఆ విమానానికి చెందిన డేటాను రిలీజ్ చేసింది. టేకాఫ్ తీసుకున్న నిమిషం లోపే ఏటీసీతో విమాన సంబంధాలు తెగిపోయినట్లు ఫ్లయిట్రేడర్ పేర్కొన్నది. అయితే తాజా సమాచారం ప్రకారం విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 40 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ విమానంలో సుమారు 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు.
విమాన దుర్ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటన చేసింది. ఎయిర్ ఇండియా చైర్మెన్ చంద్రశేఖర్ ప్రత్యేక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అహ్మాదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైనట్లు చెప్పారు.