IND vs NED : చివరి లీగ్ మ్యాచ్‌లో శివం దూబే(66) శివాలూగిపోయాడు. టాపార్డర్ విఫలమైనా ‘నేనున్నానుగా’ అంటూ అర్ధ శతకంతో విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు భారీ స్కోర్ అందించాడు. తిలక్ వర్మ,(31), సూర్యకుమార్ యాదవ్(34) మెరుపులను కొనసాగించిన దూబే.. అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్ బౌలర్లను బెంబేలెత్తించాడు. హార్దిక్ పాండ్యా(30)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన దూబే.. ఈ టోర్నీలో రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. డెత్ ఓవర్లలో దూబే, పాండ్యా మరింత చెలరేగడంతో ప్రత్యర్థికి టీమిండియా 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అజేయంగా సూపర్ 8కు దూసుకెళ్లిన భారత్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారీ స్కోర్‌తో దడ పుట్టించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(0).. తొలి ఓవర్లోనే డగౌట్‌గా వెనుదిరిగినా. ఇషాన్ కిషన్(18), తిలక్ వర్మ(31)లు.. కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అనూహ్యంగా బంతి వికెట్లకు తాకడంతో ఇషాన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(34)తో కలిసి తిలక్ జోరు పెంచాడు. వాన్ బీక్ శివం దూబే(66) రెచ్చిపోయాడు.
A power-packed partnership of 7⃣6⃣(35) 🔥
Shivam Dube 🤝 Hardik Pandya guide #TeamIndia to a strong finish 👏👏
Updates ▶️ https://t.co/SdXngdnwKB#T20WorldCup | #MenInBlue | #INDvNED pic.twitter.com/ITxBb7Qdbq
— BCCI (@BCCI) February 18, 2026
అకెర్మన్ వేసిన 13వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్‌తో స్కోర్ వంద దాటించాడు. కానీ, ఈ జోడీని క్లెన్ విడదీశాడు. బిగ్ షాట్ ఆడిన సూర్య బౌండరీ వద్ద చిక్కాడు. నాలుగో వికెట్ పడింది. అనంతరం హార్దిక్ పాండ్యా(30).. ధనాధన్ ఆడారు. వాన్ బీక్ ఓవర్లో 4, 6తో 25బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు దూబే. ఒకప్పటి తన ఐపీఎల్ మైదానంలో తడాఖా చూపిస్తూ పాండ్యా రెండు సిక్సర్లు బాదగా21 రన్స్ వచ్చాయి. చివరి ఓవర్లో సిక్సర్ కొట్టిన దూబే బౌండరీ వద్ద గుగ్టెన్ స్టన్నింగ్ క్యాచ్‌తో డగౌట్ చేరాడు. తర్వాతి బంతినే రింకూ సింగ్(6 నాటౌట్) సిక్సర్‌గా మలవగా.. ఆఖరి బంతికి పాండ్యా ఔటయ్యాడు. దాంతో.. 5 వికెట్ల నష్టానికి భారత్ 193 పరుగులు చేసింది.