Shubhanshu Shukla | భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టబోతున్నారు. వ్యోమనౌక డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ (Dragon spacecraft) ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లాతోపాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లారు. దాదాపు 28 గంటల పాటూ ప్రయాణించిన అనంతరం వ్యోమనౌక ఐఎస్ఎస్కు చేరుకుంది. 14 రోజులపాటూ వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్‌కు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.
41 ఏండ్ల తర్వాత..
1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టిస్తున్నారు. ఐఎస్ఎస్లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే.
శుభాన్షు రోదసి యాత్ర విశేషాలు
WATCH | #Axiom4Mission successfully docks at the International Space Station. The Mission has been piloted by India’s Group Captain #ShubhanshuShukla
(Video: NASA via Reuters) pic.twitter.com/B9kXGc45kA
— ANI (@ANI) June 26, 2025
Also Read..
“అద్వితీయ ‘శుభా’రంభం.. అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాన్షు”
“Shubhanshu Shukla | జీరో గ్రావిటీకి అలవాటు పడుతున్నా.. అంతరిక్షం నుంచి శుభాన్షు శుక్లా సందేశం”
“చెమట, మూత్రాన్నే నీళ్లుగా మార్చుకొని.. అంతరిక్షంలో వ్యోమగాముల కఠినమైన జీవనం”