Election results | కనిపించని తాళాలు.. ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ లాక్ పగులగొట్టిన అధికారులు
Election results | ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళంచెవి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని పిలిపించి ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ లాక్‌ను సుత్తితో పగులగొట్టించారు.
బెంగళూరు: ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళంచెవి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని పిలిపించి ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ లాక్‌ను సుత్తితో పగులగొట్టించారు. (Election results) కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని దావణగెరె దక్షిణ, బాగల్కోట్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. దావణగెరె దక్షిణలో 68.43 శాతం, బాగల్కోట్లో 68.74 శాతం ఓటింగ్ నమోదైంది.
కాగా, సోమవారం కౌంటింగ్ సందర్భంగా దావణగెరె దక్షిణ ఓటింగ్‌కు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ తాళంచెవి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఒక వ్యక్తిని రప్పించారు. భారీ భద్రత మధ్య సుత్తి, ఉలితో స్ట్రాంగ్‌రూమ్ లాక్‌ను అతడు పగులగొట్టాడు. ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంలను తరలించి ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఈ ఉప ఎన్నికల ఫలితాలను ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి.
Bizarre scenes in Karnataka.
The strong room keys in Davanagere south went “missing” forcing EC to break the lock to start the counting process. pic.twitter.com/v1HaENjnfy— Deepak Bopanna (@dpkBopanna) May 4, 2026
Also Read:
TN Election Results | తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. బోసిపోయిన డీఎంకే కార్యాలయం..!
Puducherry: ఆధిక్యంలో పుదుచ్చరి సీఎం రంగస్వామి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

