Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రజలను ఆకట్టుకునేందుకు కీలక హామీలు (Delhi poll promise) ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సోమవారం కీలక ప్రకటన చేశారు. ఆలయాలు, గురుద్వారాల్లో పనిచేసే పూజారులు (priests), గ్రంథీలకు కేజ్రీ వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే.. వారికి నెలకు రూ.18 వేలు గౌరవ వేతనం అందజేస్తామని ప్రకటించారు.
సోమవారం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘పురోహితులు, గ్రంథీలు మన ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సమాజానికి వారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు వారి ఆర్థిక శ్రేయస్సును ఎవరూ పట్టించుకోవడం లేదు. మేం అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ.18 వేలు గౌరవ వేతనం అందిస్తాం’ అని కేజ్రీవాల్ అన్నారు. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి నుంచే ప్రారంభం అవుతుందని కేజ్రీ వెల్లడించారు. హనుమాన్ ఆలయంలో తానే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తానని తెలిపారు. ఈ ప్రక్రియకు అడ్డుపడొద్దని ఈ సందర్భంగా బీజేపీని కేజ్రీ అభ్యర్థించారు. ‘రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించవద్దని నేను బీజేపీని అభ్యర్థిస్తున్నాను. దీన్ని అడ్డుకోవడం పాపం చేసినట్లే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.
आम आदमी पार्टी के जीतने पर दिल्ली में मंदिरों के पुजारियों और गुरुद्वारा साहिब के ग्रंथियों को ₹18,000 प्रति माह की सम्मान राशि दी जाएगी।
ये योजना समाज में उनके आध्यात्मिक योगदान और हमारी सांस्कृतिक धरोहर को संरक्षित रखने के उनके प्रयासों का सम्मान है।
BJP वालों इसे रोकने की… https://t.co/rJZcOxV8PR
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 30, 2024
Also Read..
Manmohan Singh | మన్మోహన్ సింగ్ అస్తికలను యమునా నదిలో కలిపిన కుటుంబ సభ్యులు
horrific crashes | విమానయాన చరిత్రలో చీకటి నెలగా డిసెంబర్.. ఏడు ప్రమాదాల్లో 240 మంది మృతి
Actor Vijay | అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి ఘటన.. తమిళనాడు గవర్నర్తో నటుడు విజయ్ భేటీ