Manmohan Singh | మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మరణించిన విషయం తెలిసిందే. ఈనెల 26న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో శనివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. కేంద్రం అధికార లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికింది. మన్మోహన్ పెద్ద కూతురు ఉపిందర్ సింగ్ తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాజాగా మన్మోహన్ అస్తికలను (ashes immerse) కుటుంబ సభ్యులు యమునా నదిలో (Yamuna river) కలిపారు. మజ్జు కా తిలా గురుద్వారా సమీపంలోని అష్ట్ ఘాట్ వద్ద సిక్కు సంప్రదాయాలను అనుసరించి ఆదివారం ఆయన అస్తికలను నదిలో నిమజ్జనం చేశారు. మన్మోహన్ సింగ్ సతీమణి, ముగ్గురు కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్మారక నిర్మాణానికి నిర్ణయం
మన్మోహన్ సింగ్‌కు ఢిల్లీలో స్మారకాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనువైన స్థలాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని పేర్కొన్నది. కాగా, స్మారక నిర్మాణం జరగనున్న స్థలంలోనే అంత్యక్రియలు జరపాలని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మన్మోహన్ అంత్యక్రియలు, స్మారకానికి స్థలాన్ని నిర్ణయించకుండా బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దేశ తొలి సిక్కు ప్రధానమంత్రిని అవమానిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
Also Read..
Manmohan Singh | మౌనమునికి కన్నీటి వీడ్కోలు.. నిగమ్ బోధ్ ఘాట్‌లో ముగిసిన అంత్యక్రియలు
Joe Biden | ఆయన వల్లే పౌర అణు ఒప్పందం సాధ్యమైంది.. మన్మోహన్సింగ్ మృతిపట్ల జో బైడెన్ సంతాపం
Manmohan Singh | దేశానికి దశదిశ చూపిన ప్రధాని.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనదే..!
Manmohan Singh | భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మన్మోహన్.. 1991 బడ్జెట్ ఓ గేమ్ ఛేంజర్