Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ (interim bail)పై బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన దృష్టంతా పూర్తిగా లోక్‌సభ ఎన్నికలపైనే పెట్టారు. ఇందులో భాగంగా జైలు నుంచి విడుదల కాగానే ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. తొలిరోజు బిజీబిజీగా గడపనున్నారు.
తనకు కోర్టు ఇచ్చిన గడువు తక్కువగా ఉండటంతో వెంటనే ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో శనివారం తన షెడ్యూల్‌ను కేజ్రీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ముందుగా ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయాన్ని (Hanuman temple) కేజ్రీవాల్ సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దర్శనం అనంతరం ఢిల్లీలోని ఆప్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు దక్షిణ ఢిల్లీలో, సాయంత్రం 6 గంటలకు తూర్పు ఢిల్లీలో రోడ్‌షోల్లో పాల్గొంటారు. ఈ రోడ్‌షోల్లో పాల్గొనాల్సిందిగా ఢిల్లీ వాసులను కేజ్రీ ఎక్స్ వేదికగా ఆహ్వానించారు. మరోవైపు ఢిల్లీలో మే 25న ఆరో విడతలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.
हनुमान जी के आशीर्वाद से, करोड़ों करोड़ों लोगों की दुआओं से और सुप्रीम कोर्ट के judges के न्याय की वजह से आप सब लोगों के बीच लौट कर मुझे बेहद ख़ुशी हो रही है।
आज मिलते हैं –
11 am – हनुमान मंदिर, कनॉट प्लेस
1 pm – प्रेस कांफ्रेंस, पार्टी ऑफिस
4 pm – रोड शो – दक्षिण दिल्ली -…
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 11, 2024
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు మార్చి 21వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణం వెనుక కీలక నిందితుడు ఆయనేనని, మద్యం వ్యాపారుల నుంచి కిక్‌బ్యాక్‌లు డిమాండ్ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఈడీ ఆరోపించింది. ఇక అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకూ బెయిల్ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో 50 రోజుల తర్వాత శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.
Also Read..
JP Nadda | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జేపీ నడ్డా
Delhi Storm | ఢిల్లీని కుదిపేసిన దుమ్ము తుఫాను.. ఇద్దరు మృతి.. విమాన రాకపోకలకు అంతరాయం
Traffic Jam | క్యూకట్టిన వాహనాలు.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్