JP Nadda | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని (Tirupati Balaji Temple) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సందర్శించారు. శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న జేపీ నడ్డాకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. జేపీ నడ్డాతో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు. మరోవైపు ఇవాళ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా తిరుపతిలో కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) నిర్వహించిన మెగా రోడ్‌షోలో నడ్డా పాల్గొననున్నారు.
#WATCH | Andhra Pradesh: BJP National President JP Nadda visits Tirupati Balaji Temple, Tirumala. pic.twitter.com/cwksntVpVS
— ANI (@ANI) May 11, 2024
Also Read..
Delhi Storm | ఢిల్లీని కుదిపేసిన దుమ్ము తుఫాను.. ఇద్దరు మృతి.. విమాన రాకపోకలకు అంతరాయం
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌కు 24 లక్షల జరిమానా
Cash | బోల్తా పడిన తౌడు లారీ.. ఏడు కాటన్లలో నగదు పట్టివేత