Delhi Storm | దేశరాజధాని ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతాన్ని శుక్రవారం దుమ్ము తుఫాను (Delhi Storm) కుదిపేసింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి (Trees Fall). చాలా భవనాలు దెబ్బతిన్నాయి (Buildings Damaged). మరోవైపు దుమ్ము తుఫాను కారణంగా చెట్లు, గోడ కూలిన ఘటనల్లో సుమారు ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 23 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు.
ఈ తుఫాను కారణంగా చెట్లు కూలాయంటూ 152 కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ తుఫాను కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఉరుములు, ఈదురు గాలులకు నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు తొమ్మిది విమానాలను జైపూర్‌కు దారి మళ్లించారు.
#WATCH | Delhi: A pandal in Rohini’s Japanese Park collapsed after gusty winds hit the National Capital & the adjoining areas, yesterday.
A change in the weather was experienced in the National Capital after Delhi and the adjoining areas experienced a duststorm last night. pic.twitter.com/hiDA52qOAy
— ANI (@ANI) May 11, 2024
నోయిడాలోని సెక్టార్ 58లో ఈదురు గాలులకు షెడ్డు కూలి పలు వాహనాలు ధ్వంసమయ్యారు. దేశ రాజధానిలో ఈరోజు వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా దక్షిణ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్, కర్ణాటక, కేరళలో వచ్చే 3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Light rainfall accompanied with thunderstorm and lightning also likley over south Punjab, Haryana, Delhi, west Uttar Pradesh, Meghalaya, south-east Arunachal pradesh, south-east Assam, manipur south interior karnataka and Kerala during next 3 hours.
— India Meteorological Department (@Indiametdept) May 11, 2024
Also Read..
Nana Patole | అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరాన్ని శుద్ధి చేస్తాం: మహా కాంగ్రెస్ అధ్యక్షుడు
ADR | 48 గంటల్లో పోలింగ్ వివరాలు తెలిపేలా ఆదేశించండి.. సుప్రీంకోర్టులో ఏడీఆర్ పిటిషన్
Japan | ఫ్రెండ్షిప్ పెండ్లిళ్లు.. జపాన్‌లో నడుస్తున్న కొత్త ట్రెండ్