Nana Patole | అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరాన్ని శుద్ధి చేస్తాం: మహా కాంగ్రెస్ అధ్యక్షుడు
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే అయోధ్యలోని రామమందిరాన్ని శుద్ధిచేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. రామమందిర నిర్మాణంలో ప్రధాని మోదీ ప్రొటోకాల్‌ను పాటించలేదని ధ్వజమెత్తారు.
Nana Patole | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే అయోధ్యలోని రామమందిరాన్ని శుద్ధిచేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. రామమందిర నిర్మాణంలో ప్రధాని మోదీ ప్రొటోకాల్‌ను పాటించలేదని ధ్వజమెత్తారు.
గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ విధానం ఆచారాలకు, సంప్రదాయానికి విరుద్ధంగా జరిగిందని ఆరోపించిన పటోలే.. ప్రాణప్రతిష్ఠ ప్రక్రియను నలుగురు శంకరాచార్యులు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు. వారితోనే ఆలయాన్ని శుద్ధి చేయిస్తామన్నారు. గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా, బాలరాముడిని ఉంచారన్న పటోలే.. తాము అధికారంలోకి వస్తే, గుడి ప్రాంగణంలో రామ్ దర్బార్‌ను నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

