అహ్మాదాబాద్: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్(Shubman Gill)కు 24 లక్షల ఫైన్ వేశారు. నెమ్మదిగా బౌలింగ్ చేయడం వల్ల ఆ జరిమానా పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జీటీ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఆ జట్టుకు ఈ సీజన్లో ఇది రెండోసారి. కెప్టెన్‌తో పాటు 11 మంది ప్లేయర్లకు కూడా ఫైన్ వేశారు. వీరితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉన్నాడు. 11 మంది క్రికెటర్లకు ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేస్తారు. దీంట్లో ఏది తక్కువగా ఉంటే దాన్ని వసూల్ చేస్తారు. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై జట్టుపై 35 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్ జట్టు గెలిచింది. గిల్, సాయి సుదర్శన్ .. ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ జట్టు 10 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నది. పాయింట్ల టేబుల్లో చెన్నై 12 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉన్నది.