Arvind Kejriwal | ఈడీ విచారణకు హాజరవుతా : కేజ్రీవాల్
Arvind Kejriwal | లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేస్తున్న సమన్లను (ED Summons) గత కొంతకాలంగా తిరస్కరిస్తూ వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేందుకు ఒప్పుకున్నారు.
Arvind Kejriwal | లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేస్తున్న సమన్లను (ED Summons) గత కొంతకాలంగా తిరస్కరిస్తూ వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేందుకు ఒప్పుకున్నారు. ఈ కేసులో ఈడీ గత నాలుగు నెలలుగా కేజ్రీకి నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందు విచారణకు హాజరుకాలేదు.
ఈడీ నోటీసులు చట్ట విరుద్ధమని, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలా తరచూ నోటీసులు ఇస్తోందంటూ కేజ్రీవాల్ కొట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలో పలు కారణాలు చూపి ఈడీ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 27న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఎనిమిదో సారి కూడా సమన్లు పంపారు. మార్చి 4వ తేదీన విచారణకు హాజరుకావాలని కోరారు. అయితే, ఈ సారి కూడా విచారణకు హాజరుకాలేనని కేజ్రీ ప్రకటించారు.
అయితే, మార్చి 12 తర్వాతే తాను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానని తెలిపినట్లు తెలిసింది. ఈ మేరకు తాజా సమన్లకు ఇచ్చిన సమాధానంలో సీఎం పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు సంస్థ సమన్లు చట్ట విరుద్ధమని ఆరోపించిన కేజ్రీవాల్.. వారి ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నట్లు తెలిపారు. మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని సీఎం స్పష్టం చేసినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
Also Read..
IPL 2024 | చెన్నైకి మరో షాకింగ్ న్యూస్.. ఐపీఎల్‌కు స్టార్ ఓపెనర్ దూరం
MSP | మద్దతు ధర మహాప్రభో.. పంటలను అమ్ముకునేందుకు అన్నదాతల ఆగచాట్లు!
Karnataka | బెంగుళూరులో తాగునీటి సంక్షోభం.. ప్రభుత్వ ఆధీనంలోకి ప్రైవేట్ ట్యాంకర్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

