Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా ఐదోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజా నోటీసులపై సీఎం ఇంకా స్పందించలేదు.
ED issues fresh summons to Delhi Chief Minister and AAP national convener Arvind Kejriwal to join investigation on February 2 in its ongoing probe in Delhi Excise policy case: Sources
(File photo) pic.twitter.com/ShfQMOoPXp
— ANI (@ANI) January 31, 2024
Also Read..
Hemant Soren | హేమంత్ సోరెన్‌ను విచారిస్తున్న ఈడీ అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం