President Murmu | 17వ లోక్‌సభ చివరి సమావేశాలు (Parliament) నేటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ కొనసాగే ఈ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఇక ఈ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము .. ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు (Parliament building) సంప్రదాయ గుర్రపు బగ్గీ (traditional buggy)లో వెళ్లారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.
#WATCH | President Droupadi Murmu departs from Rashtrapati Bhavan for the Parliament building.
The Budget Session will begin with her address to the joint sitting of both Houses. This will be her first address in the new Parliament building. pic.twitter.com/I5KmoSRcKV
— ANI (@ANI) January 31, 2024
గత శుక్రవారం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ముర్ము.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌లో కాకుండా సంప్రదాయ బగ్గీ (buggy)లో రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి బగ్గీని వినియోగించడం 40 ఏండ్ల తర్వాత అదే తొలిసారి కావడం విశేషం.
ఇక ఈ బండి వెనుక ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. బ్రిటిష్ పాలనా కాలంలో భారత దేశ వైస్రాయ్ దీనిని ఉపయోగించేవారు. అప్పటి వైస్రాయ్ ఎస్టేట్ (ప్రస్తుత ప్రెసిడెన్షియల్ ఎస్టేట్)లో ఈ బండిలో విహరించేవారు. బ్రిటిష్ పాలన అంతమై, భారత్, పాకిస్థాన్ వేర్వేరు దేశాలుగా ఏర్పాటైనపుడు ఈ విలాసవంతమైన బండి కోసం పోటీ జరిగింది. దీనిని దక్కించుకోవడానికి భారత్, పాక్ ప్రయత్నించాయి. చివరికి ఓ నాణేన్ని ఎగురవేసి, అదృష్టం ఎవరిని వరిస్తే వారిదే ఈ బగ్గీ అనే రాజీ మార్గానికి వచ్చారు. భారత దేశ కర్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్, పాకిస్థాన్ కర్నల్ సాహబ్జాదా యాకూబ్ ఖాన్ నాణేన్ని ఎగురవేశారు. అదృష్టం భారత్‌ను వరించింది. దీంతో ఈ బండి భారత్‌కు లభించింది.
Also Read..
Delhi Hotel | హోటల్ బిల్లు రూ.6లక్షలు.. అకౌంట్లో ఉన్నది రూ.41 మాత్రమే.. ఢిల్లీలో ఏపీ మహిళ చీటింగ్
President Droupadi Murmu: రామ మందిరం కల నెరవేరింది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము