Film Director | మలయాళ చిత్ర దర్శకుడు (Film Director), మాజీ ఎమ్మెల్యే పీటీ కుంజు ముహమ్మద్ (P T Kunju Muhammad) అరెస్ట్ అయ్యారు. మహిళపై లైంగిక వేధింపుల కేసులో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు (Kunju Muhammad Arrested). అయితే, కాసేపటికే అతను బెయిల్పై విడుదలైనట్లు చెప్పారు.
ఇటీవలే జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK) కోసం మలయాళ చిత్రాలను ఎంపిక చేసే ప్రక్రియ కోసం కుంజు ఓ హోటల్లో బస చేశారు. ఆ సమయంలో ఓ మహిళను కుంజు లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఈ నెల ఆరంభంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కుంజు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో కుంజు ఇప్పటికే కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందడంతో.. అతన్ని విడుదల చేశారు.
Also Read..
Jammu and Kashmir | చలి తీవ్రతకు వణుకుతున్న కశ్మీర్.. విపరీతంగా మంచు.. పడిపోయిన ఉష్ణోగ్రతలు
Nitin Gadkari | ఢిల్లీలో మూడు రోజులు ఉంటే.. అలర్జీలు వచ్చాయి : నితిన్ గడ్కరీ
Indian Nationals | అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్