Jammu and Kashmir | చలి తీవ్రతకు జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) గజగజ వణికిపోతోంది. శీతాకాలం కావడంతో కశ్మీర్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వ్యాలీ మొత్తం మంచు వర్షం కురుస్తోంది. దీంతో అక్కడ అతిశీతల వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి (Temperatures Drop Below Zero). దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
ప్రముఖ పర్యాటక ప్రాంతాలు గుల్మార్గ్ (Gulmarg), పహల్గామ్ (Pahalgam) హిల్ స్టేషన్లలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయాయి. వాతావరణ శాఖ డేటా ప్రకారం.. శ్రీనగర్ (Srinagar)లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. గుల్మార్గ్, పహల్గామ్లో వరుసగా మైనస్ 4.2, మైనస్ 2.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జమ్ము నగరంలో 8.2 డిగ్రీల సెల్సియస్, కాట్రా పట్టణంలో 9.4, బాటోట్‌లో 4.2, బనిహాల్‌లో 6.4, భదేర్వాలో 0.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కశ్మీర్ వ్యాలీ (Kashmir Valley) అంతటా చలి తీవ్రత పెరిగింది. అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సు (Dal Lake)లో చలి తీవ్రతకు నీరు గడ్డకట్టింది. ఈ చలికి సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొత్తంగా అందాల శ్రీనగర్ చలి గుప్పిట్లో వణుకుతోంది.
Also Read..
Nitin Gadkari | ఢిల్లీలో మూడు రోజులు ఉంటే.. అలర్జీలు వచ్చాయి : నితిన్ గడ్కరీ
Indian Nationals | అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్
Bangladesh | భారత్‌తో ఘర్షణలు కోరుకోవడం లేదు : బంగ్లాదేశ్