Bangladesh | మన పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో భారత్ (India)కు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనిపై ఆ దేశం తాజాగా స్పందించింది. యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పొరుగుదేశమైన భారత్తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటోందని ఆ దేశ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలేహుద్దీన్ అహ్మద్ (Dr Salehuddin Ahmed) స్పష్టం చేశారు.
‘ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం భారత్ (India) వంటి పెద్ద పొరుగుదేశంతో ఘర్షణలు కోరుకోవడం (Dont Want Bitter Ties With India) లేదు. బదులుగా న్యూఢిల్లీతో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటోంది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉద్రిక్తతలను తగ్గించి, భారత్తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్తో మంచి సంబంధాలు కొనసాగడం రెండు దేశాలకూ లాభదాయకమే’ అని అన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో ఇటీవలే చెలరేగిన భారత వ్యతిరేక నిరసనలు పూర్తిగా రాజకీయ కారణాలతో జరిగినవేనని అహ్మద్ తెలిపారు. వాటికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Also Read..
BlueBird Block-2: ఎల్వీఎం3-ఎం6 మిషన్ విజయవంతం.. కక్ష్యలోకి బ్లూబర్డ్ బ్లాక్-2 శాటిలైట్
ప్రజా జీవితానికి భంగం కలిగిస్తారా?