శ్రీహరికోట: కమర్షియల్ మిషన్‌ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇవాళ ఉదయం అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్-2(BlueBird Block-2)ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఎల్వీఎం3-ఎం6 భారీ రాకెట్ ద్వారా ఆ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. 24 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే ఇవాళ ఉదయం ఉదయం 8.55 నిమిషాలకు ఎల్వీఎం3 రాకెట్ దూసుకెళ్లింది. ఆ రాకెట్ సుమారు 43.5 మీటర్ల పొడుగు ఉన్నది. దానికి ఎస్200 సాలిడ్ బూస్టర్లు ఉన్నాయి. శ్రీహరికోటలోని రెండోవ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్రయోగించారు. అంతరిక్ష కేంద్రం నుంచి ఎగిరిన సుమారు 15 నిమిషాల తర్వాత శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. సుమారు 520 కిలోమీటర్ల ఎత్తులో ఆ కక్ష్య ఉన్నట్లు ఇస్రో చెప్పింది.
Mission Success
The LVM3-M6 mission has successfully placed the BlueBird Block-2 satellite into its intended orbit.
Youtube Livestreaming link:https://t.co/FMYCs31L3j
For More information Visit:https://t.co/PBYwLU4Ogy
#LVM3M6 #BlueBirdBlock2 #ISRO #NSIL— ISRO (@isro) December 24, 2025
న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్), అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్‌మొబైల్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా బ్లూబర్డ్ శాటిలైట్‌ను ప్రయోగించారు. లో ఎర్త్ ఆర్బిట్‌లో బ్లూబర్డ్ శాటిలైట్ విహరించనున్నది. మొబైల్ సర్వీసులు అందించేదుకు ఈ శాటిలైట్‌ను ప్రయోగించారు. 4జీ, 5జీ వాయిస్, వీడియో కాల్స్, టెక్స్ట్‌లు, స్ట్రీమింగ్, డేటా ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ శాటిలైట్ ద్వారా అందించనున్నారు. లో ఎర్త్ ఆర్బిట్‌లో మోహరించిన అతిపెద్ద కమర్షియల్ కమ్యూనిషేన్ శాటిలైట్‌గా దీన్ని గుర్తిస్తున్నారు.
విజయవంతంగా శాటిలైట్ పరీక్ష చేపట్టిన ఇస్రో బృందంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ విజన్‌ను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని ఇస్రోను మెచ్చుకున్నారు. ఒక విజయం తర్వాత మరో విజయాన్ని నమోదు చేస్తూ అంతరిక్ష టెక్నాలజీ రంగంలో భారత సామర్థ్యాన్ని చాటుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Kudos Team #ISRO for the successful launch of LVM3-M6 carrying BlueBird Block-2.
With the visionary patronage of PM Sh @narendramodi, @isro continues to achieve one success after another, reiterating India’s growing prowess in Space technology. pic.twitter.com/gsnYimTwZs
— Dr Jitendra Singh (@DrJitendraSingh) December 24, 2025