Delhi Hotel | హోటల్ బిల్లు రూ.6లక్షలు.. అకౌంట్లో ఉన్నది రూ.41 మాత్రమే.. ఢిల్లీలో ఏపీ మహిళ చీటింగ్
Delhi Hotel | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ఓ మహిళ దేశరాజధాని ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్ (Delhi Hotel) సిబ్బందిని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించి చివరికి కటకటాలపాలైంది.
Delhi Hotel | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ఓ మహిళ దేశరాజధాని ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్ (Delhi Hotel) సిబ్బందిని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించి చివరికి కటకటాలపాలైంది. లగ్జరీ హోటల్లో సుమారు 15 రోజుల పాటు బస చేసిన ఆమె.. చివరికి బిల్లు కట్టే సమయానికి చీటింగ్‌కు పాల్పడింది. ఫేక్ యూపీఐ ద్వారా డబ్బు పంపించినట్లు నమ్మించి సిబ్బందిని మోసగించింది. అయితే పేమెంట్ రాకపోవడంతో హోటల్ యాజమాన్యం ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీకి చెందిన ఝాన్సీ రాణి శామ్యూల్ (Jhansi Rani Samuel) అనే మహిళ గతేడాది డిసెంబర్ 13వ తేదీన ఢిల్లీలోగల ఏరోసిటీ (Aerocity)లో ఉన్న పుల్మాన్ హోటల్ (Pullman Hotel)లో 15 రోజులకు రూమ్ బుక్ చేసుకుని విలాసవంతమైన జీవితం గడిపింది. అయితే, ఆ 15 రోజులకు హోటల్ బిల్లు రూ.6 లక్షలు వచ్చింది. కేవలం స్పా కోసమే ఆమె ఏకంగా రూ.2.11 లక్షలు ఖర్చు చేసింది. హోటల్ వెకేట్ చేసే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ యూపీఐ యాప్ ద్వారా బిల్లు పే చేసినట్లు సిబ్బందికి చూపించింది.
అయితే హోటల్ ఖాతాలో ఎలాంటి సొమ్మూ జమకాకపోవడాన్ని గుర్తించిన సిబ్బంది.. అనుమానం వచ్చి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జనవరి 13న సదరు మహిళను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో ఝాన్సీ ఉపయోగించిన ఖాతా నికిలీదని తేలింది. ఆమె ఖాతాలో కేవలం రూ.41 మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇషా దేవ్ అనే నకిలీ ఐడెంటిటీ కార్డును ఆమె చూపించినట్లు పేర్కొన్నారు.
Also Read..
Secret Video | వాష్‌రూమ్‌లో మహిళ.. వీడియో చిత్రీకరించిన స్కూల్ టీచర్
Hyderabad | భర్తల ఆ వీడియోలను చూసి.. పోకిరీ మొగుళ్లను పొట్టు పొట్టు కొట్టిండ్రు
China | ఇల్లు కొంటే.. భార్య ఫ్రీ! చైనాలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వింత ప్రచారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

