Secret Video | ముంబై : ఓ స్కూల్ టీచర్ వక్ర బుద్ధి ప్రదర్శించాడు. మహిళ వాష్‌రూమ్‌కు వెళ్లగా, దొంగచాటుగా వీడియో చిత్రీకరించి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటనకు పాల్పడిన స్కూల్ టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో అడ్వాంటెజ్ విదర్భ పేరుతో మూడు రోజుల పాటు ఇండస్ట్రీయల్ ఎక్స్పో నిర్వహించారు. ఈ ఎక్స్‌పోకు పలువురు మహిళలు కూడా హాజరయ్యారు. అయితే ఓ మహిళ వాష్‌రూమ్‌కు వెళ్లగా, ఓ స్కూల్ టీచర్ గమనించాడు. ఆమెను అనుసరించిన అతను వాష్‌రూమ్ కిటికీలో నుంచి మొబైల్లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు.
ఈ ఘటనను గమనించిన బాధిత మహిళ.. స్కూల్ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. వాష్‌రూమ్ దృశ్యాలను చిత్రీకరించిన వ్యక్తిని స్కూల్ టీచర్ మంగేశ్ వినాయక్ రావు(37)గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యాడు.
వినాయక్ రావు మొబైల్‌ను పరిశీలించగా, దాదాపు 10 మందికి పైగా మహిళల వీడియోలు ఉన్నట్లు తేలింది. కొన్ని వీడియోలను తొలగించినట్లు రావు అంగీకరించాడు. అయితే అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 2022లో పబ్లిక్ టాయిలెట్ల వద్ద మహిళలను చిత్రీకరించినట్లు తేలింది.