Hindu Temples | హిందూ ఆలయాల్లోకి (Hindu Temples) ఇతర మతస్థుల (non Hindus) ప్రవేశంపై మద్రాసు హైకోర్టు ( Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ మతస్తులైనా వచ్చి పోయేందుకు హిందూ ఆలయాలేమీ పిక్నిక్, టూరిస్ట్ స్పాట్స్ కావంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూయేతరులను ఆలయం ముందు ఉండే ధ్వజస్తంభం వరకే అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తమిళనాడు ( Tamil Nadu )లోని అర్లుమిగు పళని ధండాయుధపాణి స్వామి ఆలయంలోకి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని, ఇతర మతస్థులు ఆలయంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ డి.సెంథిల్ కుమార్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలోని ఇతర మురుగన్ ఆలయాలకు కూడా హిందువులను మాత్రమే అనుమతించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన మధురై బెంచ్ న్యాయమూర్తి ఎస్ శ్రీమతి.. అన్యమతస్థుల ప్రవేశంపై అన్ని ఆలయాల ప్రవేశ ద్వారాల వద్ద ‘హిందూయేతరులను అనుమతించరు’ అనే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
‘హిందూ మతాన్ని విశ్వసించని హిందువులు కానివారిని అనుమతించవద్దని ప్రతివాదులకు సూచించాం… ఎవరైనా హిందుయేతరులు ఆలయంలో నిర్దిష్ట దేవతను దర్శించుకుంటామని కోరితే దేవతపై విశ్వాసం, హిందూ మతం ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తానని, ఆలయ ఆచారాలకు కూడా కట్టుబడి ఉంటాననే వారి నుంచి హామీని పొందాలి. అటువంటి హామీతో హిందుయేతరులను ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతించవచ్చు’ అని ధర్మాసనం పేర్కొంది.
Also Read..
Mayank Agarwal | విమానంలో తీవ్ర అస్వస్థత.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మయాంక్ అగర్వాల్
Delhi Hotel | హోటల్ బిల్లు రూ.6లక్షలు.. అకౌంట్లో ఉన్నది రూ.41 మాత్రమే.. ఢిల్లీలో ఏపీ మహిళ చీటింగ్
PayPal | ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పేపాల్.. ప్రపంచవ్యాప్తంగా 2,500 మందిపై వేటు