యూరియా యాప్ పేరుతో సర్కార్ రైతులను వేధిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అసెంబ్లీ జీరో అవర్‌లో ఆరోపించారు. 75శాతం మంది రైతులు యూరియా యాప్‌తో అవస్థలు పడుతున్నారని ప్రస్తావించారు. రాష్ట్రంలో 50శాతం రైతులకు స్మార్ట్ఫోన్లు లేవని, ఉన్నవారిలో 50 శాతం మందికి స్మార్ట్ఫోన్లు ఎలా వినియోగించాలో తెలియదని పేర్కొన్నారు. ఒక దఫాలో నాలుగైదు బస్తాల కంటే ఎక్కువ ఇవ్వడం లేదని ఆరోపించారు.
‘ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్ అయ్యి రైతులను మోసం చేస్తున్నారు. క్వింటాల్‌కు రూ.3వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రూ.500 బోనస్ చెల్లించాలి’ అని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.