Mayank Agarwal | విమానంలో తీవ్ర అస్వస్థత.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మయాంక్ అగర్వాల్
Mayank Agarwal | టీమిండియా క్రికెటర్ (Indian Cricketer), ప్రస్తుతం రంజీ ట్రోఫీలో కర్నాటకకు సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal ) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మయాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు (Police Complaint).
Mayank Agarwal | టీమిండియా క్రికెటర్ (Indian Cricketer), ప్రస్తుతం రంజీ ట్రోఫీలో కర్నాటకకు సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal ) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. విమానంలో తన ముందు ఉన్న ద్రవ పదార్థాన్ని మంచి నీళ్లు అనుకుని సేవిండచంతో నోటి, గొంతులో మంటతో ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు (Hospitalisation). ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై మయాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు (Police Complaint).
మయాంక్ విమానంలో కూర్చున్నప్పుడు అతని ముందున్న ద్రవాన్ని నీళ్లు అనుకొని తాగినట్లు మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ ద్రవాన్ని కొద్దిగానే తీసుకున్నప్పటికీ అకస్మాత్తుగా అతని నోటిలో ఇబ్బంది మొదలైందని చెప్పాడు. ఒక్కసారిగా అతను మాట్లాడలేని పరిస్థితికి వెళ్లిపోయినట్లు చెప్పాడు. మయాంక్ నోటిలో వాపు, బొబ్బలు వచ్చాయని వివరించాడు. మయాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెస్ట్ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. ‘మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మయాంక్ మేనేజర్ ఎన్సీసీపీఎస్ కింద ఫిర్యాదు చేశారు’ అని ఎస్పీ వెల్లడించారు.
ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కర్నాటక గోవాతో పాటు త్రిపురపైనా గెలిచింది. అంతకుముందు గుజరాత్‌తో ఓడిపోగా పంజాబ్‌తో మ్యాచ్ డ్రా అయింది. అయితే త్రిపురతో మ్యాచ్ ముగిసిన తర్వాత రైల్వేస్‌తో ఆడేందుకు గాను కర్నాటక జట్టు సూరత్‌కు బయల్దేరింది. విమానంలో కర్నాటక జట్టుతో ఉన్న అగర్వాల్.. పలుమార్లు వాంతి చేసుకున్నాడు. అదే సమయంలో అతడు తనకు నోరు, గొంతులో మంటగా ఉందని టీమ్ మేనేజ్మెంట్కు చెప్పడంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read..
PayPal | ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పేపాల్.. ప్రపంచవ్యాప్తంగా 2,500 మందిపై వేటు
Delhi Hotel | హోటల్ బిల్లు రూ.6లక్షలు.. అకౌంట్లో ఉన్నది రూ.41 మాత్రమే.. ఢిల్లీలో ఏపీ మహిళ చీటింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
Breakfast | ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం వస్తుంది..!
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

