PayPal | ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పేపాల్.. ప్రపంచవ్యాప్తంగా 2,500 మందిపై వేటు
PayPal | ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం పేపాల్ (PayPal) ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది
PayPal | ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. గూగుల్ (Google) , మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్ (Amazon), ట్విట్టర్ (Twitter), లింక్డిన్ (LinkedIn), మెటా (Meta) వంటి టెక్ దిగ్గజాలు (tech Companies) ఒకదాని తర్వాత ఒకటి సంస్థలోని ఉద్యోగులను ఇప్పటికే తొలగించాయి. పలు కంపెనీలు ఇంకా లేఆఫ్స్ కొనసాగిస్తు్న్నాయి. ఆయా సంస్థలు గత ఏడాది కాలంగా విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ లేఆఫ్స్ ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం పేపాల్ (PayPal) ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో సుమారు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు కంపెనీ సీఈవో అలెక్స్ క్రిస్ (Alex Chriss) లేఖ రాశారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ వారాంతంలో సమాచారం అందజేస్తామని లేఖలో వెల్లడించారు. కంపెనీలో డూప్లికేషన్ తగ్గించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, ఆటోమేషన్ వినియోగంతో సంక్లిష్టతలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభివృద్ధికి అవకాశం ఉన్న విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగిస్తామని ఈ సందర్భంగా క్రిస్ పేర్కొన్నారు.
Also Read..
Delhi Hotel | హోటల్ బిల్లు రూ.6లక్షలు.. అకౌంట్లో ఉన్నది రూ.41 మాత్రమే.. ఢిల్లీలో ఏపీ మహిళ చీటింగ్
Maldives Prosecutor General: మాల్దీవుల ప్రాసిక్యూటర్ జనరల్‌పై కత్తితో దాడి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

