Atal Tunnel | భారీ హిమపాతం.. అటల్ టన్నెల్ వద్ద చిక్కుకుపోయిన 300 మంది టూరిస్ట్‌లను రక్షించిన పోలీసులు
Atal Tunnel | కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మంచు వర్షం (Snowfall) కనువిందు చేస్తోంది. మంచు వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు హిమాచల్‌కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ మంచు కారణంగా మంగళవారం రాత్రి అటల్ టన్నెల్ (Atal Tunnel ) సమీపంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు.
Atal Tunnel | కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మంచు వర్షం (Snowfall) కనువిందు చేస్తోంది. దేశరాజధాని సిమ్లాలో ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తోంది. అడుగుల మేర పేరుకుపోయి శ్వేతవర్ణంతో పర్యాటకులను (Tourists) ఆహ్వానిస్తోంది. దీంతో మంచు వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు హిమాచల్‌కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ మంచు కారణంగా మంగళవారం రాత్రి అటల్ టన్నెల్ (Atal Tunnel ) సమీపంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు.
రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ (ఎస్పి) సమీపంలో భారీ మంచు కారణంగా సుమారు 50 టూరిస్ట్ వాహనాలు, ఒక హిమాచల్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు చిక్కుకుపోయింది. దాదాపు 300 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. 300 మంది పర్యాటకుల్ని సురక్షితంగా కాపాడింది. ఏటీఆర్ నుంచి పర్యాటకులందరినీ ఖాళీ చేయించినట్లు కులు ఎస్పీ సాక్షి వర్మ తెలిపారు.
మరోవైపు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకూ హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో భారీ హిమపాతం, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. చంబా, లాహౌల్-స్పితి, కిన్నౌర్, కాంగ్రా, కులు, మండీ, సిర్మూర్ సహా సిమ్లా జిల్లాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో భారీ హిమపాతం, వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
#WATCH | Kullu, Himachal Pradesh: Police rescue 300 tourists stranded near the South Portal (SP) of Atal Tunnel in Rohtang after snowfall. (30.1)
(Source: Kullu District Police) pic.twitter.com/4Aga3jG5vd
— ANI (@ANI) January 30, 2024
Also Read..
Snowfall | హిమాచల్ ప్రదేశ్‌పై మంచు దుప్పటి.. పర్యాటకుల సందడి
PayPal | ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పేపాల్.. ప్రపంచవ్యాప్తంగా 2,500 మందిపై వేటు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

